Sruthi Sourabham
Chapters
Last Page ఈ గ్రంథ రచయిత యితర రచనల గురించి ప్రముఖ విద్వాంసుల అభిప్రాయాలు డా. వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి 'శారదాపీఠం' ఎం.ఏ. (సంస్కృతం) ఎం.ఏ. పిహెచ్.డి. 46-15-35, మండావారిపేట, రీడరు, తెలుగు శాఖ విశాఖపట్నం ఆంధ్ర విశ్వకళాపరిషత్తు, విశాఖపట్నం-3. ది. 29-10-'90 మాన్య మిత్రులు డా. చిఱ్ఱావూరి శివరామకృష్ణశర్మ మహోదయులకు- నమస్సుమాంజలులు. ఉ||కు|| క్షేమపూర్వకము. ఆదరముతోc స్వయముగా నింట నందcజేసిన ఆంధ్రమునిత్రయ దర్శన సిద్ధాంత గ్రంథ ప్రతిని దర్శించితిని. కృతజ్ఞో೭స్మి. పరిశ్రమమనల్పము. అనుపమము. విద్దజ్జనైకవేద్యము. పరపప్రామాణికము. అత్యంత ప్రశస్యము. ఇంతదనుక ఆంధ్రవ్యాకరణరంగమున కళాప్రపూర్ణ వజ్ఝల సీతారామస్వామి శాస్త్రులవారినే కృతభూరిపరిశ్రములుగాc బరిగణించుచుంటిని. నేcడు వారిలోపము తీరినదని యానందించుచున్నాcడను. మీ క్షోదక్షమమైన పరిశ్రమ సర్వవిద్వజ్జన శిరోధార్యముగాక మానదు. బాలసరస్వతీయ రచనమునకుc బూర్వమే ఆంధ్రశబ్దచింతామణికి టీకగలదనియు, అథర్వణ కారికావళి అహోబలపండితీయముననే గాక ప్రత్యేక గ్రంథముగ నుండెడిదనుట - మున్నగు విశేషములు అవశ్యము అభినందింపcదగినవి. పూర్వవ్యాఖ్యాతలు, సుప్రసిద్ధ విమర్శకులు గావించిన నిర్ణయములను సప్రమాణముగ విమర్శించుటలోc గూడ భవదనుత్తమ ప్రజ్ఞా పాండిత్య విశేషములు సమ్యగావిష్కృతములనుట సత్యబద్ధమగును. గురుకుల క్లిష్టులై విద్యా సముపార్జన మొనరించిన పండితుల వ్యాసంగము నెల్లరు నభినందింప సమర్థులు గాకపోవచ్చునుగాని నిర్మత్సరులైన పండితులు తప్పక ఆమోదింప నానందింప నత్యంత సమర్థులు గాcగలరు. హృదయపూర్వకముగాc దమ కృషినభినందించుచు నితో೭ధికముగ నుత్తమ విమర్శగ్రంథముల వెలయింతురని ఆశించుచున్నాcడను. పునరభినందనములతో „sV»R½VòQû²R…V వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి ***** Prof.S.V.Joga Rao D/9-4-'91 88/2 MIG-1, M.V.P. Colony P.O. Visakhapatnam-530 017 సాధువాదములు. మీరు సాదరముగా పంపిన మీ 'ఆంధ్ర మునిత్రయ తత్త్వదర్శనము'ను ఆప్యాయంగా అందుకొన్నాను. సంతోషము. కృతజ్ఞుడను. మనసార మీకు నేనందించగలిగిన వాక్పురస్కారమొకటి :- ఇది నిజంగా ఒక దర్శనస్థాయి నందుకొన్న గ్రంథం. ఈనాటి డాక్టరు పట్ట పరిశోధన నిబంధాల్లో దీని స్థాయికి రాదగిన గ్రంథం నాకు కనిపించలేదు. శుభం! భవదీయుడు యస్వీ నాట్యశాస్త్రము, అద్వైతాక్షర మాలిక మొదలగు బహుగ్రంథానువాదకులు, వ్యాకరణ వేదాంతాలంకారశాస్త్ర పండితులు శ్రీ భాగవతుల కుటుంబరావుగారు ప్రిన్సిపాల్ (రిటైర్డ్), ఆంధ్రజాతీయ కళాశాల, మచిలీపట్నం శివరామకృష్ణశర్మగారి 'మనిషిలో మనిషి' నాటిక గురించి ఒసగిన అభిప్రాయము. 23-2-'96 డా|| శర్మగారికి నమస్కారములు. మీరు వ్రాసిన నాటిక ఆమూలాగ్రం చదివినా, అల్పగ్రంథంలో అనల్పమైన ఓ సందేశాన్ని ఇచ్చారు. ఆత్మబుద్ధిః ప్రమాణం అనే వాక్యాలను తలపునకు తెచ్చారు. లోకవృత్తానుకరణం నాట్యమేతత్ భవిష్యతి అనే భరతుని వాక్యం స్మృతికి వచ్చింది. కావ్యం వ్యవహార విదేశివేతర క్షత్రయే అనే లక్షణం పూర్తిగా మీ నాటికకు సమన్వితమగుచున్నది. ఈ నాటికలో మీరిచ్చిన సందేశం సర్వధా, సర్వులకు, సర్వదా శిరోధార్యము, అనుష్ఠేయము లోకకళ్యాణము అనే విషయంలో నాకు సంశయం లేదు. ఇటువంటి వాటిని మీరింకా వ్రాసి లోకానికి ఉపకారం చేసి, సన్మాన దర్శకులు అవుతారని ఆశిస్తున్నాను. విధేయుడు భాగవతుల కుటుంబరావు